మంత్రులుగా తాను సీతక్క ఇద్దరం రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర సహా సంక్రాంతికి ఐనవోలు, కొమురవెల్లి జాతరలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఏమో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరల నిర్వహణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండ సురేఖ. స్వామివారి దర్శనానికి వచ్చిన సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణ సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
seethakka
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లిని కూడా సందర్శించారు. నిన్న రాత్రి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఉదయం హకీంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.
Read Also..
Read Also..
ములుగు జిల్లా, మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామని సీతక్క అన్నారు , ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారు. అడగ్గానే నిధులు కేటాయించారు. అవసరమైన మేరకు మరిన్ని నిధులు ప్రభుత్వాన్ని కోరుతాం. మా ఇంటి ఇలవేల్పు మేడారం తల్లులు. అధికారులకు అన్ని సూచనలు చేశాం. జాతర విజయవంతం కోసం ప్రణాళిక రూపొందించాం. కాంట్రాక్ట్ పనులను అవినీతి లేకుండా పూర్తి చేస్తాం. శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. కేంద్రానికి కొన్ని పనులకోసం ప్రతిపాదనలు పంపాము. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రిక్వెస్ట్ పంపుతున్నాము. అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయాలి అని ఆమె కోరారు.
అసెంబ్లీ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క , కొండా సురేఖ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందర పాటు వద్దని సూచించారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో దామోదర్ రాజనర్సింహ ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన సీతక్క, కొండా సురేఖలను సోనియాగాంధీ ఆప్యాయంగా హత్తుకుని, అభినందనలు తెలియజేశారు. మంత్రులకు శాఖలను కేటాయించాల్సి ఉంది.
ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపు అనంతరం సీతక్క ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ప్రజలదని వ్యాఖ్యానించారు. 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించిందిన తాను కాదని, ప్రజలని పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ములుగు నుంచి సీతక్క మేడారానికి వెళ్లి సారలమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా, ఈ ఎన్నికల్లో సీతక్కకు 102267 పోలవగా బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతికి 68567 ఓట్లు వచ్చాయి.