కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో శివాలయం, విష్ణు ఆలయంలా వార్షికోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివాలయం పూజారి వీర కుమార్ మాట్లాడుతూ శివాలయం, విష్ణు ఆలయంలకు 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఆయన అన్నారు. అలాగే అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శివాలయం, విష్ణులయం పునఃప్రారంభించి 12 సంవత్సరాల కావస్తున్న సందర్భంలో 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరుపుకుని అనంతరం అన్న సమారాధన జరపటం జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు పదివేల మంది భక్తులు పాల్గొటం జరిగిందని ఆయన అన్నారు.
Shiva Temple
ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం. నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట. ఈ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా పనికిరాదంటారంతా ఆ విశేషాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న శివాలయం ఇది. దాదాపు నలభైఏళ్ల కష్టం ఈ అద్భుతమైన దేవాలయం. హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షించే శివాలయం. శివుడికి జటల నుంచి వచ్చి పేరే జటోలి. ఈ ఆలయం గురించి వినిపిస్తున్న కథనాలు పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నాడట. ఆ తర్వాత స్వామి కృష్ణానంద్ ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ద్రవిడ శైలిలో మూడు వరుస పిరమిడ్లతో నిర్మించారు. మొదటి పిరమిడ్లో , రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ శిల్పం, వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల, ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. లోపల స్పటిక మణి శివలింగను స్థాపించడంతో పాటు శివ, పార్వతి విగ్రహాలు కూడా ప్రతిష్టించారు. ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాలు నిర్మించారు. ఈ దేవాలయం ఈశాన్య భాగంలో ‘జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది, ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు భావిస్తారు. ఈ ట్యాంక్ లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం. అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు. అదే సమయంలో స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని అప్పటి నుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు. ఇక్కడ ఉండే గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు చెబుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఈ పురాతన ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానికులు మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంత పల్లి గ్రామ శివారులో ఉన్న స్వర్ణ దుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో త్రాచుపాము ప్రత్యక్షమైంది. స్వర్ణ దుర్గ ఆశ్రమంలో స్వర్ణ దుర్గమ్మ తల్లి ఆలయంతో పాటు శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యా అన్నదానం, కార్తీక మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం మార్గశిర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి త్రాచు పాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకుని పడగవిప్పి బుసలు కొట్టింది. ఉదయం నుంచి సుబ్రమణ్య స్వామిని చుట్టుకుని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడకు వచ్చి సుబ్రమణ్య స్వామి ఈ విధంగా వచ్చి తమ ఆశీస్సులు అందిస్తున్నారని నమస్కరించి వెళ్లిపోయారు.




Total views : 79794