తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, జెడ్పీ ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ విమలా కుమారి, స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం వాకాడుకు ముఖ్యమంత్రి బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి ఉన్నారు.
sports
జగిత్యాల జిల్లా కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు స్టంట్ వేశారు. విద్యాసాగర్ రావు కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన తనయుడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు.
Read Also…
Read Also…
ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటియూసికే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్తగనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి. ఎల్లయ్య, బ్రాంచి అధ్యక్షులు రంగు శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
గోకవరం మండలం కొత్తపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. జువెలరీ షాప్ కి వెనుకనుండి కన్నం పెట్టి మరి దొంగలించారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వేకవరపు వెంకట దుర్గా ఉమామహేశ్వర జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. గత అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి 10 కేజీల వెండి 16 గ్రాముల బంగారం చోరీ జరిగిందంటూ పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల సమక్షంలో క్లోస్ టీం సహాయంతో షాపులోని వేలిముద్రలు సేకరించారు. అలాగే సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకుంటామని కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Also….
Read Also….
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామం లోని గ్రీన్ ల్యాండ్ అనే ప్రవేట్ లాడ్జిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు గత మూడు రోజులుగా అదే లాడ్జి రూము నెంబర్ 105 లోనే బస చేసాడు. రెండు రోజులుగా అద్దె డబ్బులు కట్టకపోవడంతో తెల్లవారుజామున అద్దె కోసం రూమ్ బాయ్ తలుపులు తెరిచి చూడగా వ్యక్తి మృతి చెంది వికటజీవిగా పడి వున్నాడు. దీనితో లాడ్జ్ వాళ్ళు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రాజశేఖర్ రావు, వయసు 44 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడు గత కొద్ది సంవత్సరాలుగా కుటుంబాన్ని వదిలి శ్రీశైలంలో పలు హోటల్లో పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక్కరికి రూమ్ ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చిన అందుకు స్థానిక పోలీసుల పర్మిషన్ కావాలని తెలిసిన కూడా రూల్స్ కి వెతిరేకంగా రూమ్ ఇవ్వడంపై పలు అనుమానాలు తవిస్తున్నాయి. అనుమానస్పద మృతి ఘటనపై కేసు నమోదు చేసిన సుండిపెంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దనసరి అనసూయ (సీతక్క) హైదరాబాద్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్క లు బాధ్యతలు చేపట్టారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ (సీతక్క) ములుగు నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ, సీతక్కలకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అభినందనలు తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా రాజాంపేట పట్టణంలో 5వ ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను జబర్దస్త్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. అనసూయ భరద్వాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఎంజీఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా అంటూ రాజంపేట పట్టణంలో సందడి చేశారు. గతంలో అమలాపురం, రాయచోటి లో ఎంజీఆర్ షాపింగ్ మాల్ లను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంజీఆర్ షాపింగ్ మాల్ కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది.
Read Also…
Read Also….
ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఆరోపించారు. భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గృహం కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు. జగనన్న కాలనీలో అసంపూర్తిగా మొండి గోడలతో నిర్మాణాలు ఉన్నాయని కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ఆయన అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళల వద్ద నుంచి 35000 వరకు వసూళ్లు చేసిన కాంట్రాక్టర్ పరారయ్యాడని ఆయన ఆరోపించారు. ఏలూరులో నిర్మించిన కిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని పక్కనపెట్టి… జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రజలను మళ్ళీ మోసం చేశారని విమర్శించారు.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో శృంగవరపుకోట శాసనసభ్యులు పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు తమ గోడును ఎమ్మెల్యే కి విన్నవించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న నేషనల్ హైవే కోసం దగ్గరలో వున్న చెరువు గట్టును సగం తొలగించివేయడంతో తుఫాను సమయంలో ఆ చెరువు క్రింద ఉన్న పొలాలు మొత్తం సుమారు 25 ఎకరాలు నీట మునిగిపోయాయని రైతులు మొరపెట్టుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని చెప్పారు. అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క పంట నష్టానికి కారణమయిన నేషనల్ హైవేకి వ్యతిరేకంగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ స్థానిక రైతులు రోడ్ పై నిరసన తెలియజేశారు.
Read Also…
Read Also…
ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏలూరు నగర ప్రజలే కాకుండా జిల్లాలోని 40 గ్రామాల నుంచి ప్రతీ రోజూ వైద్య సేవలు కోసం రోగులు వస్తుంటారన్నారు. రోగికి వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఉచితంగానే చేస్తున్నారని తెలిపారు. అయితే గత కొంతకాలం నుండి అవుట్ పేషెంట్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మారై స్కానింగ్ కు 5 వేల రూపాయలు వసూలు చేస్తూ 1500 రూపాయల కమిషన్ను రిఫర్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ముట్ట చెబుతున్నారని తెలిపారు. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలు పేద రోగుల నుంచి కమిషన్ ద్వారా దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






Total views : 89111