ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 175 మంది ఐపీఎస్ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐపీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. విజయవంతంగా మొదటి దశ శిక్షణ పూర్తి చేసిన యువ ఐపీఎస్ అధికారులు విధి నిర్వహణలో తొలి అడుగు వేయబోతున్నారు. 75వ బ్యాచ్‌కు చెందిన 155 మంది యువ ఐపీఎస్ అధికారులు, వీరితోపాటు శిక్షణ పొందిన మరో 20 మంది విదేశీ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు.
telangana
అత్యంత మహిమాన్వితమైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము మల్లూరు గ్రామం, మంగపేట మండలము, వరంగల్ జిల్లాలో అందమైన కొండల మధ్య కలదు. ఈ దేవాలయము స్వయంభూ దేవాలయముగా, ఎంతో చారిత్ర కలిగిన దేవాలయముగా ప్రసిధ్ధిగాంచినది. నవ నారసింహ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఇక్కడ స్వామివారు మోండెందాకా నరరూపం, తలభాగం సింహంగా నిజరూపంగా దర్శనమిస్తారు. స్వామివారు మానవ శరీర లక్షణాలు కలిగి మెత్తగా ఉంటారు. ఈ క్షేత్రం 6వ శతాప్ధం నాటికే కలదు. 12వ శతాప్ధంలో కాకతీయులు ఆలయాన్ని పునర్నిమించారు. 17వ శతాప్ధంలో నవాబులు స్వామివారికి 150 కిలోల వెండి కవచం బహూకరించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని రావణాసురుడు తన చెల్లెలు శూర్పణఖకు కానుకగా బహూకరించాడని ప్రతీతి. స్వామివారు భారధ్వాజ మహాఋషికి దర్శనమిచ్చి తను ఈ ప్రాంతంలోని గుహలో ఉన్నానని తెలిపారు. స్వామివారు తెలిపినవిధంగా గుహని తొలుస్తూఉంటె స్వమివారి నాభికి దెబ్బతగిలింది. దెబ్బతగిలిన ప్రాంతంనుండి వచ్చే తడిని ఆపడానికి చందనం పెట్టడం జరిగింది. ఈ చందనం సంతానం లేనివారికి, కుజదొషం ఉన్నవారికి మరియు రాహువు, కేతువు గ్రహ దోషానికి ఇస్తారు. కాళసర్ప దోషానికి ఇక్కడ తైలాభిషేకం చేయడం ఇక్కడి ప్రత్యేకతలలో ఒకటి. దక్షిణ భారత దేశంలో మరెక్కడా కూడా నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేయడం జరగదు. కాని ఇక్కడ స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం మరొక ప్రత్యేకత. ఈ ప్రాంతము అర్థచంద్రాకారంలో ఉంటుంది కావున భారధ్వాజ మహాఋషి దీనికి హేమాచలమనే పేరు పెట్టారని ప్రతీతి. ఇక్కడి చింతామణి జలధార నీరు మూత్రపిండ వ్యాదులకు, నడుముకు సంబంధించిన వ్యాదులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ నీరు సంవత్సరాలపాటు నిలువ ఉండే గుణాన్ని కలిగి ఉంది.
Read also..
Read also..
Read also..
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేడు జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ..సీఈసీ సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటికే పొత్తులు సహా తుది జాబితాపై ఏఐసీసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సీఈసీ సమావేశంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక స్పష్టత రానుంది. ఇప్పటి వరకు కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్ల ను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల తర్వాత మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ శని, ఆది వారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంతోపాటు కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేతల సమావేశమైనా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం రాలేదు.
తెలంగాణలో దసరా పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో ఆర్టీసీకి సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడిపించడంతో ఆదాయం గణనీయంగా పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్ స్టేషన్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు సీబీఎస్, దిల్షుక్నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ల నుంచి కూడా ఆర్టీసీ.. ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. దసరా సందర్భంగా ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది.
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతియ రాజకీయాల్లోకి వెళతారని, రాష్ట పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఇక దినిపై మంత్రి కేటీఆర్ స్పందించారు…బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మాటికీ కేసీఆరేనని….ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉందన్నారు. అందుకే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చమత్కరించారు.






Total views : 91058