తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ TVK అధినేత, నటుడు విజయ్ ఒక భావోద్వేగ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన వద్ద సుదీర్ఘకాలం డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి కుమారుడిని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, రాజకీయాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తానని చాటిచెప్పారు. విజయ్ తన పాత డ్రైవర్ కుమారుడైన రాజశేఖర్‌ను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఖరారు చేశారు. అభ్యర్థిగా తన పేరు ప్రకటించగానే రాజశేఖర్ వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి సాధారణ డ్రైవర్‌గా పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన తనకు, ఇంతటి పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఏడుస్తున్న రాజశేఖర్‌ను చూసి చలించిపోయిన విజయ్, స్వయంగా తన చేతులతో ఆయన కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. ఈ దృశ్యం పార్టీ కార్యకర్తలను మరియు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tag:




Total views : 194241