అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి శ్రీశైలంలోని ఇద్దరి ఆధ్యాత్మిక గురువులకు శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానం వచ్చింది. ఇందులో ముందుగా శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి 1008 శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీకి అలానే ఆయనతో పాటుగా క్షేత్రంలోని శ్రీదత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రమం గురువైన శ్రీశివస్వామికి ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ మేరకు శ్రీశైలంలోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు చేతుల మీదుగా చిత్రపటం, అక్షింతలు అందజేశారు.
Vishwa Hindu Parishad
జనవరి 22న అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసినదిగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన రెండు వేల మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముమ్మరంగా శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ఆహ్వాన పత్రాలను ఆయా ప్రముఖులకు స్వయంగా అందజేసే బాధ్యతను విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ శశిధర్ రావినూతల బృందానికి అప్పగించగా వారు ఆహ్వాన పత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అన్నవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను ” అన్నారు.
విశ్వహిందూ పరిషత్ నాయకులు గుర్రం సంజీవ రెడ్డి మాట్లాడుతూ ” తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి ఆహ్వానాన్ని మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి వారి స్వగృహానికి వెళ్లి, state guests గా హాజరు కావాలని కోరాము. ఈ సందర్భంగా ఆయన ఆదరంగా రిసీవ్ చేసుకోవటమే కాకుండా ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు అందుకు జరిగిన సుదీర్ఘ న్యాయ పోరాట వివరాలను కూడా చెప్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. స్వయంగా ఆహ్వానం అందిస్తూ చిరంజీవి గారితో మేము గడిపిన అరగంట సమయం మాకొక ఉద్విగ్న భరిత అనుభవంగా నిలిచిపోతుంది” అన్నారు.
ఇదిలా ఉండగా ఆ రోజు రామ్ చరణ్ ఊరిలో లేని కారణంగా నిన్న ముంబై నుండి ప్రత్యేకంగా విచ్చేసిన జాతీయ నాయకులు సునీల్ అంబేకర్, రామ్ చరణ్ ఉపాసన దంపతులను రామ విగ్రహ స్థాపన లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డు అందజేయడం జరిగింది. రాంచరణ్ కూడా ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరవుతారు.
అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఉలవపాడులో అయోధ్య రాముని అక్షింతల ఊరేగింపు జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ఆధ్వర్యంలో ఉలవపాడు మండల వాసులు, రామభక్తులు ఊరేగింపుగా అక్షింతలను మండలంలోని శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పంచాయితీ వారి జన సంపర్క్ అభయాన్ ప్రముఖులకు, సహ ప్రముఖులకు అక్షింతలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత సహ కార్యదర్శి పర్రే. కోటేశ్వరరావు, జన సంపర్క్ అభయాన్ జిల్లా సహ ప్రముఖులు కోట సురేంద్ర రెడ్డి, ఉలవపాడు మండలం జన సంపర్క్ అభయాన్ ప్రముఖ ఏ సత్యం, సహ ప్రముఖ పి వెంకట్రావు, విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి కోనసం సంజీవరెడ్డి, సత్సంగ ప్రముఖ బి బాలిరెడ్డి అన్ని పంచాయతీల జన సంపర్క్ ప్రముఖులు పాల్గొన్నారు.




Total views : 78975