కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. కూరగాయల్లో బీరకాయచాలా ముఖ్యమైంది. బీరకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పీచు పదార్థం ఎక్కువుగా ఉండడం వల్ల వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు బీరకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం. బీరకాయ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాదు చాలామంది మహిళలు రక్తహీనతతో భాధపడుతుంటారు. ఈ సమస్యకు బీరకాయ చెక్ పెడుతుంది. కడుపులో మంట తో భాధపడేవారు బీరకాయ తీసుకోవడం మంచిది. బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి సహాయ పడుతుంది. కామెర్లు వచ్చిన వారు బీరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాదు బీరకాయ కళ్ళకు సంభందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని చేదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బీరకాయ తరచు తింటే మీ చర్మం కూడా నిగనిగలాడడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
vitamin C
బఠానీలు ఒక రకమైన గింజ ధాన్యాలు. వీటిని పచ్చిగానూ, ఎండబెట్టి కూడా ఆహారపదార్ధాలుగా వాడతారు. అయితే పచ్చి బఠానీలను కూరల్లోనూ, ఎండు బఠానీలను చిరుతిండి గానూ ఉపయోగిస్తారు. అయితే ఈ పచ్చి బఠానీలను వాడే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవి తొక్కలు ముదిరి ముడతలు పడకూడదు, తొక్కలపై నల్లటి పసుపు రంగు మరకలుండకూడదు. అటువంటి వాటినే కూరల్లోకి ఉపయోగించాలి. శీతాకాలంలో ఎక్కువగా దొరికే వీటిని వెజ్ బిర్యానీ, బంగాళ దుంప, పన్నీర్ వంటి వాటికీ జత చేసి వాడతారు. ఈ పచ్చిబఠాల్లో అనేక ఆరోగ్య ప్రయాజనాలున్నాయి. అందుకనే వీటిని వింటర్ డైట్ కు ఫర్ ఫెక్ట్ వెజిటబుల్ గా అభివర్ణిస్తారు. పచ్చిబఠానిల్లో ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ , ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్- A , C , K లు పుష్కలంగా ఉన్నాయి. కనుక వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు మంచిది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్ కె అత్యధికంగా ఉంటుంది. పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది. పచ్చిబఠానీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బఠాణీలు తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధకులు తెలిపారు. ఇన్సులినను నియంత్రిస్తుంది. కనుక డయాబెటిస్తో బాధపడుతున్న వారికి పచ్చి బఠాణీలు చక్కని ఆహారం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో రక్తంలో గ్లూకోజ్ త్వరగా చేరదు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి పచ్చి బఠాణీ చక్కటి ఆహారం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది . ఎముకలకు బలం చేకూర్చుతుంది. ఆర్థరైటిస్, ఆస్టియోపారోసిన్లను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కనుక పచ్చిబఠానీలు దొరికే సమయంలో తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులుసూచిస్తున్నారు.
పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే గుర్తుకొస్తుంది. కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. మిర్చిలో విటమిన్ ‘ఎ’, ‘సి’లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె జబ్బులు రాకుండా చేసే పొటాషియం, క్యాన్సర్ కారకాలతో పోరాడే బీటా కెరొటిన్ వంటి పోషకాలుంటాయి. పచ్చి మిరపలో ఉండే పోషకాలు అజీర్తి సమస్య ఏర్పడకుండా కాపాడతాయి. కెలొరీలని కరిగించి జీవ క్రియలు వేగంగా జరిగేట్టు చూస్తాయి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తగిన మోతాదులో పచ్చి మిరపకాయలు ఆహారంలో తీసుకుంటే ఉపశమనం పొందుతారు. వీటిల్లో పుష్కలంగా ఉండే ‘ఎ’ విటమిన్‌మెరుగైన కంటిచూపూ ఎముకలూ, పళ్ల బలానికి సాయపడుతుంది.
మనం వాడే ప్రతి వంటకాలలో మిరియాలు, మిరియాలపొడి తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు, మన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నోలాభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుందని తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అధిగమించాలంటే మిరియాల చారు తాగమంటున్నారు. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుందని తెలిపారు. శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి తేనె ఒకచెంచా కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు. ముఖ్యంగా ఈ మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా ఉపయోగపడుతాయని అంటున్నారు.
చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. ధూమపానం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగరెట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగడం వల్ల నికోటిన్ అనే పదార్ధం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇది వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కసారి పొగతాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజుల పాటు ఉంటుంది. అయితే మీరు ధూమపానం చేసినా ఆ ప్రభావం మీ ఆరోగ్యంపై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగతాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు, ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గించగలవనే విషయాన్ని గుర్తించుకోవాలి. యాపిల్స్ లో చాలా పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, అనామ్లజనకాలు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడగలవు. మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు. మీ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లోని నికోటిన్ ను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలోయాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ శరీరంలో ఉండే మలినాలు మొత్తం బయటకు వెళ్లేలా చేయగల గుణాలు కలిగి ఉంటుంది. నికోటిన్ ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు తోడ్పడగలదు. దానిమ్మలోనూ యాంటీఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. శరీరానికి రక్త ప్రసరణ సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉంటాయి. దానిమ్మను తరుచూ తింటూ ఉంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ధూమపానం చేసేవారు దానిమ్మను తింటూ ఉంటే నికోటిన్ మొత్తం తగ్గిపోతుంది. దానిమ్మను పండు తిన్నా దాంతో జ్యూస్ చేసుకుని తాగినా చాలా ప్రయోజనాలుంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, సీ, కే, బీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం. అలాగే నికోటిన్ ను వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ధూమపానం చేసే వారు రోజూ క్యారెట్ తినడం చాలా మంచిది. అలాగే కాలీఫ్లవర్, కాలే, టర్నిప్, క్యాబేజీ వంటి కూరగాయాలతో తయారు చేసిన పదార్థాలను తరుచుగా తింటూ ఉంటే మీ ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం అంతగా ఉండదు. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ధూమపానం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూడగలదు. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించగలదు. నికోటిన్ ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలు గ్రీన్ టీలో ఉంటాయి. అందువల్ల తరుచుగా గ్రీన్ టీ తాగుతూ ఉండండి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణుల అంటారు. వందగ్రాముల గుజ్జులో 42 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ పీచు శాతం మాత్రం చాలా ఎక్కువ. ఈ పీచు క్యాన్సర్‌కు కారణమైన రసాయనాల్ని పీల్చేస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గేందుకూ సహకరిస్తుంది. ఇందులో విటమిన్-ఎ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే నారింజనిన్, నారింజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి వూపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. వీటితోపాటు, లైకోపిన్, బీటా కెరోటిన్, క్సాంథిన్, ల్యూటిన్ వంటి ఫ్లేవొనాయిడ్లూ ఎక్కువే. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిచూపూ మెరుగుపడుతుంది. సి-విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. సహజమైన ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 100 గ్రా. తాజా పండులో 135 మి.గ్రా. పొటాషియం ఉంటుంది. గుండె వేగాన్ని నియంత్రించేందుకూ రక్తపోటు అదుపునకూ ఇది ఎంతో ఉపయోగం. ఎరుపురంగులో ఉండే గ్రేప్ ఫ్రూట్లో లైకోపిన్ ఉండటంవల్ల ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటంతోబాటు ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచీ రక్షిస్తుంది. ఇతర కెరోటినాయిడ్లతో పోలిస్తే క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి లైకోపీన్‌కే ఎక్కువ. లిమోనాయిడ్లూ గ్లూకారేట్లూ కూడా ఇందులో ఎక్కువ. ఇవి రొమ్ముక్యాన్సర్లూ ట్యూమర్లూ రాకుండా కాపాడతాయి. ఇందులోని నారింజనిన్ అనే ఫ్లేవొనాయిడ్ దెబ్బతిన్న డి.ఎన్.ఎ.ను సైతం బాగుచేస్తుందట. ఇందులో కాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతోపాటు కొద్దిపాళ్లలో బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఇది వూబకాయాన్ని నివారించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు నిర్ధరించారు.
ఇంట్లోనే తయారు చేసిన ఈ మాస్క్‌తో నల్లని పెదాలు ఎర్రగా మారతాయి. పెదాలు దొండపండులా ఎర్రగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ, అలా కాకుండా కొన్ని కారణాల వల్ల పెదాలు నల్లగా మారతాయి. అలా కాకుండా ఏం చేయాలో తెలుసుకోండి. ఇంట్లోనే తయారు చేసిన ఈ మాస్క్‌తో నల్లని పెదాలు ఎర్రగా మారతాయి. ఎదుటివారిని చూడగానే ఆకర్షించేవాటిలో నవ్వు ముందుంటుంది. చక్కని దంతాలు, చూడచక్కని పెదాలు చిరునవ్వుని అందంగా చేస్తుంది. అలాంటప్పుడు పెదాలు ఎర్రగా ఉంటే చిరునవ్వు మరింత అందంగా ఉంటుంది. కానీ, చాలా మందికి పెదాలు నల్లగా ఉంటాయి. అలా కాకుండా పెదాలు ఎర్రగా కనిపించాలంటే ఓ మాస్క్ బాగా పనిచేస్తుంది. ఆ మాస్క్‌ని ఎలా తయారు ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో కొబ్బరి నూనె, పసుపు, కొద్దిగా పంచదార పొడిలా చేసి వేయాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం కలపి పేస్టులా చేయాలి. దీనిని పెదాలకి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. తర్వాత టూత్‌బ్రష్‌తో పెదాలను సున్నితంగా మసాజ్ చేస్తే నలుపు తగ్గి పెదాలు మృదువుగా అందంగా మారతాయి. నిమ్మరసం అనేది చర్మానికి మేలు చేస్తుంది. నల్లమచ్చల్ని తగ్గించి చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది. ఇది పెదాలపై ఉన్న నలుపుని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు బ్లీచింగ్ ప్రభావాలు ఉంటాయి. దీంతో ఇది పెదాల నలుపుని దూరం చేస్తుంది.
మొలకలు అనేవి విత్తనాలు, గింజలు లేదా బీన్స్ నుండి వచ్చే చిన్న, ఆకుపచ్చ మొక్కలు. అవి సాధారణంగా చాలా పోషకాలు మరియు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవి పోషకాలకు మంచి మూలం. మొలకలు విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లకు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల బ్రోకలీ మొలకలు 100% రోజువారీ విటమిన్ సి అవసరాలను అందిస్తాయి మరియు 20% రోజువారీ విటమిన్ కె అవసరాలను అందిస్తాయి. బ్రోకలీ మొలకలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మొలకలు ఫైబర్ మరియు ప్రోటీన్‌కు మంచి మూలం. ఈ పోషకాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మొలకలు మరియు ఫైబర్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొలకలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి, ఇవి కణాలకు నష్టం కలిగించే అణువులు. మొలకలు మరియు యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మొలకలు తక్కువ కేలరీలు మరియు ఫైబర్‌కు మంచి మూలం. ఈ పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మొలకలు మరియు బరువు తగ్గడం మొలకలను వివిధ మార్గాల్లో తినవచ్చు. వాటిని సలాడ్లు, సూప్‌లు, స్టీవ్‌లు, టోస్ట్‌లు మరియు ఇతర వంటకాలలో జోడించవచ్చు. మీరు వాటిని తాజాగా తినవచ్చు లేదా వాటిని డ్రై చేయవచ్చు లేదా ఎండబెట్టవచ్చు. మీ ఆహారంలో మొలకలను చేర్చడం వల్ల మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును. ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది. రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్ రూపంలో తీసుకోగలిగితే ‘సి’ విటమిన్ పుష్కలంగా అందుతుంది. తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది. జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి. దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అధిక కఫాన్ని నియంత్రిస్తుంది. రక్తంలోని వ్యర్థాలను తొలగించి రక్తానికి తగినంత ఆక్సిజన్ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది. ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి. ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.
గుమ్మడి అనేది ఒక రుచికరమైన మరియు పోషకమైన కూరగాయ. ఇది భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో సాధారణంగా పండిస్తారు. గుమ్మడిని ఆయుర్వేదంలో కూడా ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. గుమ్మడిలో విటమిన్ సి, విటమిన్ ఏ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడిలో విటమిన్ సి, విటమిన్ ఈ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుమ్మడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. గుమ్మడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి.
Read Also..
Read Also..





Total views : 91096