కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకగాంధీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించారు. వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ స్థానంలో తన సమీప అభ్యర్థి సత్యన్ మోఖరీపై 4 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గెలుపొందారు. ఉపఎన్నికలో ప్రియాంకకు 6 లక్షలకు పై చిలుకు ఓట్లు పడ్డాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన నవ్య హరిదాస్ మూడో స్థానంలో నిలిచారు. మరోవైపు.. వయనాడ్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గరి నుంచి ఈసారే పోలింగ్ శాతం అత్యల్పంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ శాతం 72.92 ఉండగా.. ఈ ఉపఎన్నికలో కేవలం 64.72 శాతంగానే ఉంది. కాగా.. ఈ ఎన్నికలో ప్రియాంకతో కలిపి 16 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేశారు. వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4 లక్షల 3 వేల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి