ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి, విజిల్స్ వేస్తూ సభకు టీడీపీ ఆటంకం కలిగించారని. పోడియం దగ్గర నిరసన తెలపడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్ అయ్యారు.
YCP MLAs
అనంతపురం జిల్లాలో రా.. కదలిరా.. కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. మాజీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు వ్యవహార శైలి పై ధ్వజమెత్తారు. ఆయన తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటున్నారు.
బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని, మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని మమ్మల్ని ఏమాత్రం పలకరించి ఎందుకు వచ్చారని అడగలేదని అంటే అంగన్వాడీలు అంత తీసేసారా, ఎమ్మెల్యేకి అంత అహంకారం పనికిరాదని రాష్ట్రంలో వైసిపి శాసనసభ్యులు అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్కు, వైసీపీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు.





Total views : 78214