మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ఏ6గా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 2 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, రెండు పూచీకత్తులు ఇవ్వాలని, పాస్ పోర్టును కోర్టుకు అప్పగించాలని తెలిపింది. ప్రతి వారం పులివెందుల పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని షరతులు విధించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే… ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ, వైఎస్ సునీత కోర్టును కోరవచ్చని తెలిపింది. కేసులో కీలక నిందితులు వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ…
- కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.లిక్కర్ రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కారుమూరిపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు..…
- ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు.…
- ‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్విసిసి & సుకుమార్ రైటింగ్స్ మైథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్…
- అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8వ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు. ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు. సాధించిన అభివృద్ధిని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి