484
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి సూసైడ్ కలకలం
నిర్మల్ జిల్లా, బాసర ఆర్జీయూకేటీ(Basara RGUKT)
బాసర ఆర్జీయూకేటీ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థి అర్వింద్, వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, విద్యార్థి మృతి పట్ల ఆర్జీయూకేటీ-బాసర్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వెంకట రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. బాసర ట్రిపుల్ ఐటీలో గతంలోనూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి సూసైడ్ కలకలం





Total views : 90231