ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాడిని ఖండిస్తూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ, ముందే ప్లాన్ చేసుకొని మా కార్యకర్తలపై నాయకులపై రాళ్లు విసరడం జరిగింది సుమారుగా 35 కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మూడుసార్లు ఓడిపోయిన మళ్లీ ఓడిపోవడానికి నామినేషన్ వేసి ఇలా దాడి చేయడం కరెక్టు కాదని హెచ్చరించారు. దాడికి ప్రతి దాడి చేస్తే అది కరెక్ట్ కాదని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలే బుద్ధి మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లో ఇక్కడ ఇబ్రహీంపట్నంలో అవకాశం ఇవ్వరు అని అన్నారు. ఏది ఏమైనా మా కార్యకర్తలను నేను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు.
Hyderabad
ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నామినేషన్ వేయడానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోనియమ్మా ఇచ్చిన ఈ తెలంగాణను కాపాడుకుంటామని ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకొని అమలు చేస్తామని 11 వ తారీఖున రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలను మండల సాయి నాయకులు తీసుకు వస్తారని సిపిఐ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో కొద్ది మేలు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని రాష్ట్రంలో వివిధ అనేక వర్గాల్లో జరిగిన అభివృద్ధి కంటే ఐదు శాతం కూడా బెల్లంపల్లి నియోకార్గంలో జరగలేదని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాగంగా సిపిఐ సిపిఎంలు కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. చిన్నయ్య తన తండ్రి అయిన గడ్డం వెంకటస్వామి పై చేసిన అనూచిత వాఖ్యలకు పరువునాష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Read Also..
రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఉదయం తన నివాసం మైలార్‌దేవ్‌పల్లి ప్రజాభవన్ ఆరంగర్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ ఆర్డిఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తనను బలపరిచి నందుకుగాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని.. ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళనాపై ఉంటుందని. ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. నామినేషన్ దాఖలుకు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేస్తామని ఆయన అన్నారు.
ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థి గా నవీన్ యాదవ్ నామినేషన్ వేయడానికి తమ అభిమానులతో కార్యకర్తలతో భారీ ర్యాలీ గా వెళ్లారు.. తన పార్టీ ఆఫీస్ లో పూజ నిర్వహించి తన తల్లి ఆశీర్వాదం తో భారీ ర్యాలీ గా వెళ్లడం జరిగింది. నామినేషన్ అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతు ప్రజలే నా బలం, నా నియోజకవర్గ ప్రజలే నను గెల్పిస్తారు అని తెలిపారు. ఎల్లపుడు ప్రజలకు అండగా ఉంటా, సమస్యలలో ఉన్న నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తాం, ప్రజల సంఘీక్షేమం కోసం అభివృద్ధి కోసం పని చేస్తాం.
Read Also..
ముషీరాబాద్ లో బిఆర్ఎస్ విజయం తథ్యం అని ముఠాగోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ బిఆర్ ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ ర్యాలీ నిర్వహించి అట్ట హాసంగా నామినేషన్ దాఖలుచేశారు.నామినేషన్ ప్రారంభానికి ముందు ముషీరాబాద్ చౌరస్తాలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా ఆయన బయలుదేరి ముషీరాబాద్ రిటర్నింగ్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి వి.లక్ష్మిణా రయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మత్కడుతూ తాను చేసిన అభిరుద్దె తనను గెలిపిస్తుందన్నారు.
కంటోన్మెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత తన తండ్రి స్వర్గీయ సాయిన్న ఆశీస్సులతో ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దర్ వెన్నెల ఎదురు కావడంతో ఒకరికి ఒకరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకున్నారు. తన తండ్రి స్వర్గీయ సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు తన జీవితంని త్యాగం చేశారని తెలిపారు. ఆయన ను ఆశీర్వదించిన విధంగానే కంటోన్మెంట్ ప్రజలు నన్ను కూడా ఆశీర్వదించి ఈ ఎలక్షన్ లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు.
మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. నామినేషన్‌కు ముందు కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఆంజనేయస్వామి భక్తుండనని అందుకే ఇక్కడ పూజలు నిర్వహించనని తెలిపారు. రాబోయేది బిజెపి ప్రభుత్వం అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వసతులు కల్పిస్తామని సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అందెల తెలియజేశారు. బిజెపి గుర్తుకు ఓటు వేసి మహేశ్వరం నియోజకవర్గం నుండి తనను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. పార్టీకి చెందిన నేతలు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also..
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కొరుతున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజు ముషీరాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు నామినేషన్ ర్యాలీ రామ్ నగర్ చౌరస్తా నుండి ప్రారంభమైంది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. భారీ ర్యాలీగా వచ్చిన పూసరాజు ముషీరాబాద్ లో ట్యాంక్ బండ్‌లోని ఎమ్మార్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని లక్ష్మణ్ తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. దాచుకోవటం దోచుకోవటం కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని లక్ష్మణ్ వెల్లడించారు భారీ మెజారిటీతో ముషీరాబాద్ బిజెపి అభ్యర్థి పూసరాజును గెలిపించాలని ముషీరాబాద్ ప్రజలను లక్ష్మణ్ కోరారు
ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అబ్యర్తి బండారి లక్ష్మారెడ్డి సర్వమతాల ప్రార్థన అనంతరం సైనిక్ పురి లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూల మాల వేసి నామినేషన్ వేయడానికి ఉప్పల్ కు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా మహిళలు హారతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిచేశారు.
Read Also..
Read Also..
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్, ఎంఎల్ సి శంభీపూర్ రాజు పాల్గొన్నారు.. ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సురారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జిహెచ్ఎంసి వరకు ప్రతి కార్యకర్త చేతిలో గులాబీ జెండా, మెడలో గులాబీ కండువతో పండుగ వాతవరణంలో భారీ ర్యాలీని నిర్వహించి మరో సెట్ నామినేషన్ ను వేశారు. ఎంఎల్ఎ అభ్యర్థి వివేకానంద.





Total views : 200999