హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద మొత్తంలో హవాలా నగదును పట్టుకోవడం గమనార్హం. పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ.30 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదుతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు… రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Hyderabad
పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఏ.ఆర్.గ్రౌండ్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా పోలీస్, అగ్నిమాపక మరియు NDRF కి సంబంధించిన పరికరాలను ప్రదర్శించారు. ప్రదర్శన లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ జాగిలాలు, రైఫిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాలోన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని విజయవాడ సిటీ కమిషనర్ కాంతి రానా తెలిపారు.
మునుగోడు సీటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటాయించటంపై కాంగ్రెస్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాలో మునుగోడు సీటును కేటాయించింది. మునుగోడు సీటు రాజగోపాల్ రెడ్డికి కేటాయించడాన్ని సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు నిరసనగా రాజగోపాల్ రెడ్డి అమర్ రహే అంటూ దిష్టిబొమ్మని తగులపెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీని కష్టకాలంలో వదిలేసి ఎన్నికల సమయంలో తిరిగి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు. ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందని, ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ కోల్పోతోందని చెప్పారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దిన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుచరులు, అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది.
పేట్ బషీరాబాద్ దూలపల్లి క్రాస్ రోడ్డులో పోలిసులు వాహనాలు తనీఖిలు చేస్త్రువుండగా.. పుష్ప సినిమా తరహాలో గంజాయి సరఫరా చేస్తు పట్టుబడ్డారు. గంజాయిని అమర్చుటకు కారు ను ప్రత్యేకంగా తయారు చేసి అందులో నలభై ఒక్క ప్యాకెట్ల గంజాయిని అమర్చారు. సుచిత్ర సెంటర్ నుండి నిజామాబాదు వెల్తున్న కార్ ని దూలపల్లి లో ఆపి తనిఖీలు చేయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 82కేజిల గంజాయిని,కారు,రెండు సెల్ ఫోన్లు స్వథీనం చేసుకోని, నిందుతులపై కేసు నమోదు చేసి దార్యప్తు చేస్త్రున్నారు పోలీసులు.
రాజకీయంగానే కాకుండా చంద్రబాబు విజన్‌పై కూడా ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఐటీ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్‌లో ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపించకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కనిపించేలా చంద్రబాబు పేరును అబాసుపాలు పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు ఘనంగా నిర్వహించేందుకు అక్టోబరు 29న గచ్చిబౌలి మైదానంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన iamwithcbn.co వెబ్ సైట్ ను జూబ్లీహిల్స్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. చంద్రబాబుపై కృతజ్ఞత చూపించే ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన అభిమానులంతా వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకొని గచ్చిబౌలిలో నిర్వహించండి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ కూడా జైల్లో ఉన్నారని, ఏపీ ప్రజల కోసం చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల ఆయనకు ఎలాంటి మలినాన్ని అంటుకోదని పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో నిపుణుల కమిటీ సమీక్ష చేసి అనంతరం జలాశయాన్ని సందర్శించనుంది. జలాశయాన్ని పరిశీలించిన వెంటనే నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలాఉండగా..కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం పొంచిలేదని సాగునీటి రంగ ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ ఇంజినీరింగ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన వారంతా నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు.
గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో.. ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా… కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందన్నారు. బీఫారాల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని, బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. భాజపా అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24వేలు అని చెప్పిన కేటీఆర్.. అందులో తెలంగాణ వాటా 10వేలని వివరించారు.
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతియ రాజకీయాల్లోకి వెళతారని, రాష్ట పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఇక దినిపై మంత్రి కేటీఆర్ స్పందించారు…బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మాటికీ కేసీఆరేనని….ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉందన్నారు. అందుకే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చమత్కరించారు.
ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. BDL రోడ్డు దగ్గర ఎన్నికల కోడ్ అమలులో భాగంగా యస్. ఐ. రామకృష్ణ మరియు సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కార్ లో సుమారు రెండు కోట్ల విలువైన బంగారు మరియు డైమండ్ ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన బంగారం,డైమండ్ ఆభరణాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు.




Total views : 194730