సనత్ నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎదుర్కోవాలంటే అస్త్రాలు అవసరం లేదు ఇక్కడ ఏ ఆడపడుచును అడిగిన వాళ్ళ కన్నీటి బొట్టు చెబుతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం అభివృద్ధి చేశారు అనేది. దళిత గిరిజన సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ గారు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట్ డివిజన్ బాపూనగర్ బస్తీలో గురువారం డాక్టర్ కోట నీలిమ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ బాపునగర్ బస్తీలో అనేక సమస్యలు ఉన్న స్థానిక నాయకులు విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Hyderabad
మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరుపున ప్రచారం చేయడానికి ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఈరోజు మల్కాజిగిరి లో ప్రచారం నిర్వహించారు. ఆనంద్ బాగ్ నుండి మల్కాజిగిరి వరుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మి సాయి గార్డెన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, మల్లారెడ్డి, శంబిపుర్ రాజు స్థానిక నాయకులు, ఉద్యమ కారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంధర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజిగిరి అభివృద్ధి చెందాలంటే గుండాలు కాదు సౌమ్యులు కావాలని అలాంటి మంచి వ్యక్తే మల్కాజిగిరి బి.ఆర్.ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అని ఆయనను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంది. మన లాంటి స్కీములు దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
కుత్బుల్లాపూర్ కాలేశ్వరం ప్రాజెక్ట్ ఒక స్కామ్ అని ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్టు అని కాంగ్రెస్ పార్టీ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ షమ మహమ్మద్ అన్నారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, వాటికి ఇప్పటివరకు మచ్చలేదని తెలిపారు. ఇటీవల కర్ణాటకలో గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను విజయవంతంగా ప్రజలకు అందజేస్తుందని , అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణలోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాగానే అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కమిషన్ల కకృతి కోసం కెసిఆర్ ప్రభుత్వం కాలేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి నిరుపయోగంగా కోట్ల రూపాయలు వృధా చేశారని… కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే కెసిఆర్ రైతులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు.. కాలేశ్వరం కట్టి ఎంత మంది రైతులకు ఉపయోగకరంగా మార్చారో తెలపాలన్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గాంధీభవన్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు. ఇబ్రహీం పట్నం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద హంగామా చేస్తుండటంతో హై టెన్షన్ చోటు చేసుకుంది. రేవంత్ ఫ్లెక్సీలను కార్యకర్తలు తగలబెట్టారు. గాలిలోకి కుర్చీలను దండెంరాంరెడ్డి వర్గీయులు విసిరేశారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని.. టికెట్ ఇవ్వకుంటే రెబల్ గా పోటీచేస్తానని రాంరెడ్డి తెలిపారు.
హైదరాబాద్…ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు లేనిదే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని కాచిగూడ డివిజన్ చప్పల్ బజార్లో కాలేరు వెంకటేష్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది సందర్భంగా ఎమ్మెల్యే ఖాదర్ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ నమోదు చేస్తుందని వారు తెలిపారు మరోసారి అంబర్పేట్ లో గులాబీ జెండా ఎగరవేస్తామని కాలేరు వెంకటేష్ దిమా వ్యక్తం చేశారు.
కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా దొంగను పట్టుకున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు జైలు కు పోయినట్టు సమాచారం. కాటారం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 22,23 తేదీల్లో సురేందర్ రెడ్డి ఇంట్లో దొంగతనాలు చేసాడు. 90వేల నుంచి లక్ష విలువ చేసే నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి జీడిమెట్ల గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలో చోరీ.. అమ్మవారి తాళి బొట్టుని అపహరించాడు. జీడిమెట్ల సరోజిని గార్డెన్ వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో తెల్లవారుజామున దొంగతనం చోటుచేసుకుంది. ఆలయంలో చొరబడి అమ్మవారి బంగారు తాళిబొట్టు చోరీ చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. దేవాలయం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పేట్ బషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐటీ ఉద్యోగులు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ టీమ్ సంగీత విభావరి నిర్వహించింది. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు పలువురు నందమూరి కుటుంబసభ్యులు ఇందులో పాల్గొన్నారు.అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతుండగా కొందరు నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు, పోటీ చేయొద్దని కొందరు నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తక్షణమే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో పోటీ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలకు కాసాని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని తెలుస్తోంది. మరోవైపు దమ్ముంటే కాసాని ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మరి కొందరు నేతలు సవాల్ విసిరారని తెలుస్తోంది.





Total views : 198628