తెలంగాణ సంసృతి సంప్రదాయలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంగరంగా వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే ఒక వేములవాడ పట్టణంలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరగడం అనవాయితీగా వస్తుంది. మహిళలు బతుకమ్మను పేర్చిన తర్వాత పసుపుతో గౌరమ్మను పూజించి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా తమ నిత్య జీవితంలో కష్టసుఖాలను పాటలుగా మార్చి ఆడుతూ పాడారు. గుమి కూడి ఆటపాటలతో సంబరాలు నిర్వహించుకున్నారు. వేములవాడ మూలవాగు వద్ద మున్సిపల్ శాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. మూలవాగు వద్ద సాయంత్రం మొదలైనా బతుకమ్మ నిమజ్జనం వేములవాడ పట్టణంలోని మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ నిమజ్జనం కో సం ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పలో బతుకమ్మ ను నిమజ్జనం చేశారు.పోయిరా గౌరమ్మ… పోయిరావమ్మా… అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అవరణలో మహిళలు దండియా, కోలాటాలతో సందడి చేశారు.
Telangana
బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులంతా, మళ్లీ నా వద్దకు వస్తారని నిర్మల జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ధీమీ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే ,ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తానని అన్నారు. ఎమ్మెల్యే తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను చేసిన మంచి పనుల వల్లే నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తారన్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిన పార్టీలో పని చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్.. తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా చాలా ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పామన్నారు.హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారన్నారు. గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటెల గెలవరు’ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ రెండో జాబితా ఖరారుకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశానికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితాను అతి త్వరగా విడుదల చేయాలని చూస్తోంది. ఈ సమావేశంలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు. బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని, తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని విమర్శించారు.తెలంగాణాలో కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారన్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లాది రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వస్తుంది! తెలంగాణ గెలుస్తుంది! అని ట్వీట్ ముగించారు.
గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి కేటీర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో.. ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరు కోపం ఉన్నా… కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు దృఢమైన విశ్వాసం ఉందన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందన్నారు. బీఫారాల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్.. ఫలితాల్లోనూ ముందే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 40చోట్ల అభ్యర్థులు లేరని, బీజేపీ యుద్ధానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. భాజపా అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24వేలు అని చెప్పిన కేటీఆర్.. అందులో తెలంగాణ వాటా 10వేలని వివరించారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో 1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు. మిగిలిన 90వేల నియామకాలు వివిద దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. తాము 13వేలు ఇచ్చామని వెల్లడించారు. భారాస 30 వైద్య కళాశాలలు పెట్టిందని గుర్తు చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు.. ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఏ మాత్రం పోటీ కాదని, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలు ఏమాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో 5గంటల కరెంటు కోత వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకే పంటను పరిమితి మేరకు కొనుగోలు చేస్తారని, వాళ్లు మాకు సుద్దులు చెబుతారా? అని విమర్శించారు. గతంలో ఖమ్మంలో తమకు నేతలు నిండుగా ఉన్నా… ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. ఈసారి కొందరు నేతలు వెళ్లారు.. సీట్లు పెరుగుతాయని అనుకుంటున్నాం. మణికొండ, మక్తల్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని కేటీఆర్ విమర్శించారు.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశాం ముగిసిందని, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు. అభ్యర్థల గురించి చర్చ జరిగిందిని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మానిక్ రావు థాక్రే తెలిపారు. అయితె అభ్యర్థులపై ఇంకో సమావేశాం జరిగే అవకాశం ఉందని థాక్రే అన్నారు. రెండవ జాబితాలో మిగతా అన్ని స్థానాల అభ్యర్ధులను ఖరారు చేయాలని అనుకుంటున్నామని, తదుపరి కాంగ్రెస్ సీఈసీకి జాబితా పంపిస్తామన్నారు. అవసరమైతే స్ర్కినింగ్ కమిటీ భేటీ అయ్యి…స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని మానిక్ రావు థాక్రే అన్నారు. వీలైనంత త్వరలో సీఈసీ మీటింగ్ ఉంటుందని, కమ్యూనిస్టు పార్గీలతో చర్చలు కొనసాగుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని థాక్రే అన్నారు.
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతియ రాజకీయాల్లోకి వెళతారని, రాష్ట పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఇక దినిపై మంత్రి కేటీఆర్ స్పందించారు…బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మాటికీ కేసీఆరేనని….ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉందన్నారు. అందుకే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చమత్కరించారు.
ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. BDL రోడ్డు దగ్గర ఎన్నికల కోడ్ అమలులో భాగంగా యస్. ఐ. రామకృష్ణ మరియు సిబ్బంది తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక కార్ లో సుమారు రెండు కోట్ల విలువైన బంగారు మరియు డైమండ్ ఆభరణాలు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన బంగారం,డైమండ్ ఆభరణాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు.




Total views : 194146