రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, వారిని లాభాల బాట పట్టించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మక్కజొన్న పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విత్తన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన దేశంలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా మన శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాలకే ఫుల్ డిమాండ్ ఉందన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలతో పంటలు పండిస్తేనే మంచి లాభాలు వస్తాయని, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతుల్లో ఆ నమ్మకాన్ని పెంపొందించడం సంతోషకరమన్నారు. అన్నదాతకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్యతో పాటు పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు
రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో మక్కజొన్న విత్తన కార్యక్రమం..
47
previous post





Total views : 89224