హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు. బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం, వారికి జరుగుతున్న అన్యాయాలపై అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తిని తెలంగాణ ఇన్‌చార్జిగా, అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.తెలంగాణలో బ్రాహ్మణులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ద్రోణంరాజు రవికుమార్ విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండగా, ప్రస్తుతం తెలంగాణలో ఆ సంఖ్య ఒక్కరికే పరిమితమైందన్నారు.ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం నాలుగు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో అల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సమావేశం.
826