Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News కామారెడ్డి జిల్లాలో మారిన వాతావరణం..

కామారెడ్డి జిల్లాలో మారిన వాతావరణం..

by CVR NEWS
కామారెడ్డి జిల్లాలో మారిన వాతావరణం

కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది. మరోవైపు మండుటెండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. విలీన గ్రామాలైన అడ్లూరు, పాత రాజంపేట, టేక్రియాల్ ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.గాంధారి మండలం సర్వాపూర్ గ్రామంలో కూడా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యంపై కప్పిన ప్లాస్టిక్ కవర్లు గాలికి ఎగిరిపోవడంతో వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది. సమయానికి కాంటాలు చేయకపోవడం, లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యాన్ని తరలించలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గత నెల రోజులుగా మండిపోతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం కురవడంతో కొంత ఉపశమనం పొందారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019216
Total views : 90108

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.