27
పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైన సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు ముంపు ప్రాంతాల వివరాలు, పునరావాస చర్యలు, రక్షణ పనులపై ఆరా తీశారు.ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.


Total views : 92037