Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home International మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే

మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే

by Rama
మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే

ఉక్రెయిన్ మాజీ మిలటరీ కమాండర్ ఇన్ చీఫ్, బ్రిటన్ లో ఉక్రెయిన్ రాయబారిగా ఉన్న వాలెరీ జలుజ్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని భావిస్తున్నానని జలుజ్నీ వ్యాఖ్యానించారు. తాజా సంక్షోభంలో రష్యా మిత్రపక్షాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందన్నారు.

ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్‌పై పోరాడుతున్నారని, ఇరాన్ రూపొందించిన ఆయుధ సామాగ్రితో ఉక్రెయిన్‌లో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. దీనిని ఇక్కడితో ఆపడం సాధ్యమేనని… కానీ కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీనిని అర్థం చేసుకోవడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు అనేకమంది శత్రువులు ఉన్నట్లు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: