Thursday, October 1, 2026
News Navigation
Thursday, October 1, 2026
News Navigation

Breaking

Thursday, October 1, 2026
Home Andhra Pradesh ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం

by Rama
Adudham andhra

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని జడ్పీ బాలుర ఉన్నత ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి 2K రన్ స్దానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ 2K రన్ శ్రీకాళహస్తి ప్రభుత్వ జడ్పీ పాఠశాల నుంచి నాలుగు మాడ వీధులలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీనివాసులు, పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు 2K రన్ లో క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను క్రీడాకారులను పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీయడానికి ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఒక వేదిక అవుతుందని, దీనిని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. గ్రామ వాలంటీర్లు మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనే క్రీడాకారులకు రిజిస్టర్‌ చేసే అవకాశం ఉందన్నారు. దీన్ని గ్రామస్థాయి క్రీడాకారులు మరియు క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వినియోగించుకోవాలని క్రీడాకారులను కోరారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: