Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Health చర్మ సౌందర్యానికి వెన్న

చర్మ సౌందర్యానికి వెన్న

by Satya
butter

పెదవులు నల్లగా ఉన్నాయని ఆందోళన పడుతున్నారా… అయితే మీరేం చేయాలంటే.. వెన్న, ఆరెంజ్ రసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేస్తూ వచ్చారంటే లిప్‌స్టిక్ వెయ్యకుంటానా మీ పెదవులు అందంగా, మృదువుగా మారిపోతాయి. పసిపిల్లలకు స్నానం చేయించటానికి ముందు వెన్నను ఒంటికి పట్టించి, నలుగు పెట్టి స్నానం చేయిస్తే పాపాయి చర్మం కాంతిగా, మృదువుగా ఉంటుంది. వంటిపై సన్నని నూగులాంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి. వెన్నను ముఖానికి పట్టించి మెత్తటి సున్నిపిండిలో పసుపు కలిపి ముఖం రుద్దుకుంటే చర్మపు వర్చస్సు పెరుగుతుంది. నలుపు ఛాయలో ఉన్నవారు వెన్నలో తేనెను కలిపి పేస్టులా తయారుచేసి, నిత్యం ముఖానికి పట్టిస్తే నలుపు తగ్గి, ముఖ చర్మం ప్రకాశవంతమవుతుంది. వెన్నలో గులాబి రెక్కల పేస్టును కలిపి పెదాలకు రాస్తే పెదాలు గులాబీ రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వెన్న, కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి కళ్లక్రింద ఏర్పడిన నల్లని చారలకు, ముడతలకు రాస్తూంటే మచ్చలు తొలగిపోతాయి. వెన్నలో పసుపు కలిపి మడమలకు, పాదాల పగుళ్లకు రాస్తే దురదమంట తగి, చర్మం మెత్తపడి పగుళ్ళు తగ్గిపోతాయి. ప్రతిరోజూ వెన్నలో నల్ల నువ్వులు కలిపి, చిన్న మాత్రలా చేసి తింటే వెంట్రుకలు నెరవకుండా నల్లగా ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంలో మొదటి ముద్దలో వెన్న కలిపి తింటే వృద్ధాప్య లక్షణాలు త్వరగా ఏర్పడవు. వెన్నలో పసుపు, సున్నం కలిపి కట్టుకడితే గోరుచుట్టు తగ్గుతుంది. కాలిన బొబ్బల మీద ఆరారగా వెన్న రాస్తే మంట ఉపశమనం. వెన్నను కనురెప్పలమీద రాస్తే, వెంట్రుకలు రాలిపోకుండా దృఢంగా, అందంగా ఉంటాయి. బొప్పాయి గుజ్జులో వెన్నను కలిపి ముఖ చర్మంమీద సున్నితంగా మసాజ్ చేస్తే ముఖ చర్మం మృదువుగా మారి, తేమతో కాంతిగా, అందంగా కనిపిస్తుంది.

Advertisements

You may also like

Our Visitor

009356
Total views : 61938

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.