Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప.. మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్..

తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప.. మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్..

by CVR NEWS

మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప.. మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్ గానే ఉందని కీలక ప్రకటన చేసింది ఇరాన్ సర్కార్. హార్ముజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ఇండియాతో పాటు చాలా దేశాలలో చమురు కొరత ఏర్పడింది. యుద్ధం ప్రారంభమై 15 రోజులైనప్పటికీ హార్ముజ్ జలసంధి నుంచి నౌకలు ప్రయాణించడం లేదు. దీంతో చాలా దేశాలలో ఎల్పీజీ, పెట్రోల్ కొరతలు ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది.

తమపై యుద్ధం ప్రకటించిన, తమను శత్రువులుగా భావిస్తున్న దేశాలకు హార్ముజ్ జలసంధి మూసివేసి ఉంటుందని.. మిత్ర దేశాలకు మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంటుందని అధికారిక ప్రకటన చేసింది ఇరాన్. దీంతో ఇండియాతో పాటు పలు దేశాలకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక ఇప్పటి లాగే చమురు నౌకలు హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా ప్రపంచంలో 30% కంటే ఎక్కువ ముడి చమురు సరఫరా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. ఈ జల సంధి మార్గం పూర్తిగా ఇరాన్ చేతుల్లోనే ఉంది. ఈ యుద్ధం నేపథ్యంలో తాత్కాలికంగా హార్ముజ్ జలసంధిని మూసివేశారు. కాగా ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాదాపు 15 రోజులుగా యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇరాన్. ఇక ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం ఖ‌మేనీ మరణించినప్పటికీ కూడా ఆయన కుమారుడు మొజ్తాబా ఖ‌మేనీ రంగంలోకి దిగాడు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: