తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న ఓ భక్తుని ఆహారంలో జర్రి రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం,వారు అతనిని బిల్లు కట్టి వెళ్లాలి అంటూ హుకుం జారీ చేయటంతో గోడవ కాస్తా బయటకు పొక్కింది.అటు తరువాత నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగింది.తిరుపతి లోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ (FSO) నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేసారన్నారు తిరుపతి బిజేపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి.తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) లు ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యతారాహిత్యం అని అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం రెండుసార్లు అయినా నగరంలోని హోటల్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు.తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రమే?తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలనన్నారు.తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్,ఆరోగ్యశాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం కొంత మంది అవినీతి అధికారుల కారణంగా పవిత్రత,పరపతి మంట కలుస్తున్నదని,పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో పాటు స్థానికులకు నగరంలోని కొన్ని హోటల్స్ నాసిరకం పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమన్నారు.తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉంటాయని అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని పర్యవేక్షించాల్సిన అధికారులే నెల మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారన్నారని ఆరోపించారు.తిరుపతిలోని హోటళ్లను నెలలో కనీసం రెండు మూడు సార్లు అయినా తనిఖీలు చేయకపోవడంతో నాసిరకం ముడి సరుకులతో నాణ్యతలేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెట్టి తిరిగి కస్టమర్స్ కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతినిత్యం నగరంలోని అన్ని తరహా హోటల్స్ లో ముమ్మర తనిఖీలు చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేని హోటల్స్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భక్తుల,స్థానికుల తరఫున నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందనదేశానికి అన్నం పెట్టే అన్నదాత.. ఇప్పుడు అడుగడుగునా దగా పడుతున్నాడు. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ప్రార్థించిన ఆ కళ్లు.. ఇప్పుడు గిరిజన సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో అన్నదాతల పరిస్థితి…
- వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.రాష్ట్రంలో వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా అధికారులకు, విత్తన కంపెనీల ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. నకిలీ విత్తనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని,…
- ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది? హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ? ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది ? ప్రభుత్వ పరం అయిన…
- చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు…
- ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2,540 కోట్ల రూపాయలతో అమరావతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 61450