Friday, May 15, 2026
News Navigation
Friday, May 15, 2026
News Navigation

Breaking

Friday, May 15, 2026
Home Latest News నేడు సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

నేడు సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

by Prakash
ktr at shad nagar

మంత్రి కేటీఆర్‌ నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లోఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌వింగ్ ‌ను ప్రారంభిస్తారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యయనాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్‌ సమీపంలో ఉన్న ఐబీపీ గోదాం మైదానంలో నిర్వహించే యువ ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీటీసీ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్ధపు మాధవి, బండ నర్సయ్య, ఏనుగు మనోహర్‌రెడ్డి, రాఘవరెడ్డి, లోక బాపురెడ్డి పాల్గొననున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013621
Total views : 77875

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.