Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Telangana వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

by Prakash
telangana rain

ఉత్తర తమిళనాడు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. తెలుగు రాష్ట్రాల వైపు తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇక ఆదివారం చూసుకుంటే.. వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. ఆదిలాబాద్‌లో కనిష్ఠంగా 15.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 22.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: