రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ,ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్షన్ 4,000 కి పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ నిలబెట్టుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెన్షన్ 4,000 తో సహా ఏప్రిల్ నుండి ఇవ్వాల్సిన పెంచిన మొత్తంతో కలిపి 7,000 రూపాయలు అందించడంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ దారులకు 7,000 రూపాయలు అందించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం లోని 9 వ వార్డు నందు, శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం, ఏర్పేడు మండలం మేర్లపాక, మేర్లపాక హరిజనవాడ, మన్నసముద్రం, తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు హరిజనవాడ గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ NDA కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే ఒకే సారి 1,000 పెంచి 7,000 రూపాయలు అందిస్తున్నామని, గత ప్రభుత్వం విడతల వారీ అని మోసం చేసిందని, వెయ్యి రూపాయలు పెంచడానికి 5 సం.|| తీసుకుని ప్రజలను మోసం చేశారని తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్‌సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.