బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు అనుకొని హిందూ మహా సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడనున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. దీని ఎఫెక్ట్ తో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇటు అల్పపీడనం ఎఫెక్ట్ తో రాయలసీమలో కూడా రేపటి నుంచి వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలలో ఈనెల 22వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చలి తీవ్రత క్రమ క్రమంగా తగ్గుతోంది. ఉష్ణోగ్రతలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపు ఎండాకాలం వచ్చింది. మధ్యాహ్నం పూట బయటకు వెళ్తే, ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మార్చి మొదటి వారంలో ఎండలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. అటు ఎండల తీవ్రత పెరగగానే ఒంటిపూట బడులు కూడా ప్రారంభం కానున్నాయి.
బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం…
278
previous post





Total views : 92778