597
రాజస్థాన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది..ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. ఖేర్తల్-తిజారా జిల్లా భివాడీలోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే ఫ్యాక్టరీ మొత్తానికి మంటలు వ్యాపించడంతో బయటకు రాలేక సజీవదహనమయ్యారు 8 మంది కార్మికులు. భారీగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో వీరంతా అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. మరో 20 మంది కార్మికులను కాపాడారు. ఆ ఫ్యాక్టరీలో అక్రమంగా టపాసులు తయారుచేస్తున్నట్టు సమాచారం.