Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సర్పంచ్‌లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

by CVR NEWS
2024లో సీఎం అయిన వెంటనే టీటీడీ ప్రక్షాళనపై దృష్టి పెట్టాం

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కానుంది. జనవరి 5వ తేదీన గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాల ఆధారంగా ఈ నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించిన వివరాలను మెజర్‌మెంట్ పుస్తకాలలో నమోదు చేసి ఉంటే, ఆ బిల్లులను చెల్లించవచ్చని తెలిపింది. గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో సర్పంచ్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వారికి ఊరట కలిగించింది. ఈ నిర్ణయంతో పంచాయతీల్లో నిలిచిపోయిన చెల్లింపులకు మార్గం సుగమం అయ్యింది.

Advertisements

You may also like

Our Visitor

020108
Total views : 92240

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.