Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Agriculture నిజామాబాద్ జిల్లా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.

నిజామాబాద్ జిల్లా యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.

by CVR NEWS

నిజామాబాద్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. నందిపేట్ మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం గంటల తరబడి వేచి చూసినా అందకపోవడంతో రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపించారు. వెంటనే యూరియా యాప్‌ను రద్దు చేసి, రైతులకు నేరుగా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

020188
Total views : 92377

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.