Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News యూట్యూబర్ అన్వేష్ కు మెటా సంస్థ బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు మెటా సంస్థ బిగ్ షాక్

by CVR NEWS

ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. సుమారు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించింది. అయితే, అకౌంట్ తొలగింపుపై అన్వేష్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు. అకౌంట్ తొలగించడంపై తనకు ఎలాంటి బాధ లేదని చెబుతూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశారు. “నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి? అది నా ఈకతో సమానం” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన అకౌంట్ పోయినందుకు ఆనందపడుతున్న వారిని ‘బత్తాయిలు’ అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని శరీర భాగాలతో పోలుస్తూ అన్వేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “రెండు ఇన్‌స్టాగ్రామ్‌లు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానళ్లు, నా రెండు కాళ్లు, ఫేస్‌బుక్ నా శరీరం. ఈ ఐదు భాగాలను నడిపించేది నా తెలివైన బుర్ర. ఒక చెయ్యి లాంటి అకౌంట్ పోతే మరో చెయ్యి ఉంది. అన్నీ పోయినా నా తలతో మాట్లాడి ముందుకు వెళ్తానని అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Advertisements

You may also like

Our Visitor

020232
Total views : 92554

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.