Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Latest News పాక్‌లో తిరిగి అడుగుపెట్టిన నవాజ్‌ షరీఫ్‌

పాక్‌లో తిరిగి అడుగుపెట్టిన నవాజ్‌ షరీఫ్‌

by Rama
Nawaz sharif

పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశీ గడ్డపై అడుగుపెట్టారు. వివిధ కేసుల్లో కోర్టు విచారణలు ఎదుర్కొంటున్న షరీఫ్‌ గత నాలుగేళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్‌ నేతలతో లండన్‌ నుంచి ప్రత్యేక ఛార్టెడ్‌ విమానంలో పాకిస్థాన్‌కు వచ్చారు. ఇస్లామాబాద్‌ చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏవెన్‌ ఫీల్డ్‌, అల్‌ అజీజియా అవినీతి కేసుల్లో ఆయనకు ఈ నెల 24 వరకు ఇస్లామాబాద్‌ హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. తోషాఖానా, వాహనాల కేసులో ఆయనపై అరెస్టు వారెంటును అవినీతి నిరోధక కోర్టు అదే తేదీ వరకు రద్దు చేసింది. దీంతో నవాజ్‌ అరెస్టు భయం లేకుండా పాక్‌లో తిరిగి అడుగుపెట్టగలిగారని సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

039129
Total views : 194371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: