Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుంది..

రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుంది..

by Rama
Congress Party

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్ ఈరోజు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, ఈసారి జరిగే ఎన్నికల్లో పౌరసత్వ వివాదంలో ఉన్న రమేష్ బాబుకు కాకుండా మరో అభ్యర్థి ని తీసుకురావడంతోనే వారి పరాజయం ఖరారు అయిందన్నారు. రాష్ట్ర మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుందని వేములవాడ నుండి కూడా తాను ప్రజల ఆశీర్వాదంతో గెలవడం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గం తాను ఎన్నిక కాగానే వేములవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మార్చి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, వేములవాడ పట్టణంలో మహిళా డిగ్రీ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039366
Total views : 196497

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: