124
మంత్రి రోజా జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నగరి ప్రజల కన్నీళ్లు చూస్తోందని ఆయన విమర్శించారు. నిన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి పై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం పై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి నగరి ఏం అభివృద్ధి జరిగింది. ఈ ఐదు మండలాల్లో మంత్రి రోజా ఆమె అనుచరులు దోచుకోవడం దాచుకోవడం తప్ప నగరి అభివృద్ధి శూన్యం అన్నారు. నగరిలో రంగు నీటి సమస్య నగిరి నియోజకవర్గంలో కొండగుట్ట ఇసుక అక్రమంగా తమిళనాడుకు తరలిపోతుందని ఎద్దెవా చేశారు. ఆమె నగరి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసారో ఆ అభివృద్ధిని చూపించాలంటూ బీజేపీ నాయకులు సవాల్ విసిరారు.