Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home TelanganaHyderabad జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద భారీ ధర్నా..

జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద భారీ ధర్నా..

by Rama
Darna near JNTU

కూకట్ పల్లి లోని జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేట్ విద్యార్థుల తో కలిసి భారీ ధర్నా నిర్వహించారు . యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R 22 లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని కోవిడ్ సమయాలలో విద్యార్థులకు సరైన తరగతులు జరగక ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేసి R17, R18, R 22 లో డైటైన్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ముగిసిన తర్వాత భారీ ఎత్తున జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు వారికి న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039302
Total views : 196355

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: