Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ నిషేధం

సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ నిషేధం

by Satya
WhatsApp

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై వేటు వేసింది. సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించిన 69 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ గత డిసెంబరులో నిషేధించింది. ఈ ఖాతాలు భారత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు వాట్సాప్ గుర్తించింది. 2023 డిసెంబరు 1 నుంచి 31వ తేదీ మధ్య 69 లక్షల 34 వేల ఖాతాలపై వాట్సాప్ తొలుత ఆంక్షలు విధించింది. వాటిలో 16 లక్షల 58 వేల ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, నేరుగా నిషేధం విధించింది. డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16వేల 366 ఫిర్యాదులు అందాయి. అంతకుముందు, నవంబరులోనూ భారత్ లో 71 లక్షల సమస్యాత్మక ఖాతాలపై వాట్సాప్ వేటు వేసింది. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు చెందిన వాట్సాప్ కు భారత్ లో 50 కోట్ల యూజర్లు ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019061
Total views : 89846

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.