Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Business డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో విచారణ

డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో విచారణ

by Satya
Inquiry in High Court on DSC notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానం, ఎన్సీటీఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ వాదనలు వినిపించారు. తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాదిమంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం కోర్టు తీర్పు మీకు వర్తించదా అని వ్యాఖ్యానించింది. ఒక్కసారి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశ వ్యాప్తంగా అమలు కావలసిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా మంగళవారం ఈ పిటిషన్‌ను విచరిస్తామని హైకోర్టు వెల్లడించారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
  • ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.
    తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
  • అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం
    మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…

Advertisements

You may also like

Our Visitor

020343
Total views : 92740

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.