Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home TelanganaKarimnagar యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ..

యాత్ర ఏర్పాట్లపై బీజేపీ నాయకులతో బండి సంజయ్ భేటీ..

by Rama
Bandi sanjay

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపటి నుండి మలిదశ ప్రజాహిత యాత్రకు సిద్ధమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో ఉదయం 11 గంటలకు యాత్ర ప్రారంభించనున్నారు. తొలిరోజు కోహెడ మండలంలో ప్రారంభమయ్యే యాత్ర తీగలగుంటపల్లి, గోటమిట్ల, నారాయణపూర్, విజయనగర్ తోపాటు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. రాత్రి బొమ్మనపల్లి సమీపంలోని ప్రైవేట్ స్కూల్ లో బస చేస్తారు. యాత్రలో భాగంగా కోహేడ, చిగురుమామిడి మండల కేంద్రాల్లో బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

బండి సంజయ్(bandi sanjay) పాదయాత్ర కు రూట్ మ్యాప్ క్లియర్

Follow us on : Facebook, Instagram & YouTube.

ఇది చదవండి: టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ పై మంత్రి రోజా సెటైర్లు

మరోవైపు ప్రతిరోజు సగటున 10 గ్రామాల్లో పాదయాత్ర చేసేలా బీజేపీ జిల్లా నాయకత్వం రూట్ మ్యాప్ ను ఖరారు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించనుంది. మలిదశ యాత్రలో భాగంగా రేపటి నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

రెండోరోజు హుస్నాబాద్ రూరల్ మండలంలోని మహ్మదాపూర్, నాగారం, పోతారం, హుస్నాబాద్, పందిళ్ల, గోవర్ధనగిరి, రామవరం, అక్కన్నపేట, అంతక్కపెట, కట్కూర్, మల్లారం, కొత్తకొండ గ్రామాల్లో పర్యటిస్తారు. 3వ రోజు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో, 4, 5 రోజుల్లో ఇల్లందకుంట, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్, హుజూరాబాద్ రూరల్ మండలాల్లో 6వ రోజు సైదాపూర్, వీణవంక మండలాల్లో యాత్ర చేస్తారు. మార్చి 2 నాటికి హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్రను పూర్తి చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు. మరోవైపు ప్రజాహిత యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే …
‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!
స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో ‘కాంతార’ …
విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

008615
Total views : 56956

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.