Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Latest News ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి…

ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి…

by Prakash
Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధిష్ఠానం పూర్తి చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం 10 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశముంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించవచ్చు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. గురువారం స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులపై చర్చ జరగనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: