Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home National జ‌మ్మూక‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న ప్ర‌ధాని మోదీ

జ‌మ్మూక‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న ప్ర‌ధాని మోదీ

by Satya
Prime Minister Modi

ఆర్టికల్‌ 370 రద్దు.. మొదటిసారి కశ్మీర్‌కు ప్రధాని మోదీ..

ప్ర‌ధాని మోదీ(Prime Minister Modi) జ‌మ్మూక‌శ్మీర్(Jammu and Kashmir) ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. 2019 ఆగ‌స్టులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత క‌శ్మీర్‌కు మోదీ వెళ్ల‌డం ఇదే మొద‌టిసారి. మ‌రోవైపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌మ్మూక‌శ్మీర్‌(Jammu and Kashmir) లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. వేలాదిగా పోలీసు(police)లు, ఆర్మీ బందోబ‌స్తు విధుల్లో ఉన్నారు. ఇక ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న మోదీ..

శ్రీన‌గ‌ర్‌లో ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్క‌ర‌ణ త‌ర్వాత ఆయ‌న బ‌హిరంగ సభ‌లో ప్ర‌సంగిస్తారు. శ్రీన‌గ‌ర్‌లోని బ‌క్షి మైదానంలో జ‌ర‌గ‌నున్న ‘విక‌సిత్ భార‌త్‌ విక‌సిత్ జ‌మ్మూక‌శ్మీర్’ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. అలాగే కేంద్ర పాలిత ప్రాంతంలో వ్య‌వ‌సాయ ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధి కోసం సుమారు రూ.5వేల కోట్ల విలువైన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ధాని ప్రారంభిస్తారు.

సుమారు రూ.5వేల కోట్ల విలువైన కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ధాని ప్రారంభం..

దీంతో పాటు శ్రీన‌గ‌ర్‌లోని హ‌జ్ర‌త్ మందిరంలో స్వ‌దేశ్ ద‌ర్శ‌న్‌, ప్ర‌సాద్ ప‌థ‌కాల కింద రూ.1400కోట్ల వ‌ర‌కు పర్యాటక రంగానికి చెందిన ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తార‌ని స‌మాచారం. అంతేగాక ఇటీవ‌ల కొత్త‌గా కొలువులు సాధించిన దాదాపు 1000 మందికి మోదీ అపాయింట్‌మెంట్ లెట‌ర్లు ఇవ్వ‌నున్నారు. అలాగే 2వేల రైతు సేవా కేంద్రాల‌ను ఏర్పాటుచేస్తార‌ని బీజేపీ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ ను ప్రారంభించిన ప్రధాన మోదీ


గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు …
చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న …
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039689
Total views : 199218

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: