Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Telangana తెలంగాణలో నేటినుంచి జూడాల సమ్మె సైరన్

తెలంగాణలో నేటినుంచి జూడాల సమ్మె సైరన్

by Satya
తెలంగాణలో నేటినుంచి జూడాల సమ్మె సైరన్

తెలంగాణలో నేటినుంచి జూడాల సమ్మె సైరన్ … రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు ఈరోజు నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లింపు, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌లకు 1.25 లక్షల రూపాయలు గౌరవ వేతనం, వైద్యకళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్లతో ఈ నెల 18న సమ్మె నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో నిరవధిక సమ్మె చేపట్టి విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. ఓపీ సేవలు, సర్జరీలు, వార్డ్‌ సేవలను నిలిపివేస్తున్నామని, అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
    ఎండ‌ల‌తో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ చ‌ల్లని క‌బురు చెప్పింది. రెండు రాష్ట్రాల‌లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ‌లో అక్కడ‌క్కడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ద్రోణి అంత‌రాయం…
  • కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..
    కుప్పం విమానాశ్రయ భూసేకరణకు మార్గం సుగమమైంది. 150 ఎకరాల సేకరణ నోటిఫికేషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తెలిపింది. భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇటీవల ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై పలువురు సుప్రీం కోర్టులో…
  • 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
    ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
  • బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
  • కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..
    బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009338
Total views : 61695

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.