Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్

పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్

by Satya
పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యేపిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను రాత్రి ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో బెయిల్‌ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో రిమాండ్‌ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్‌ పిటిషన్లనూ హైకోర్టు రద్దు చేయడంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నరసరావుపేట రూరల్‌ సీఐ మల్లికార్జున్‌ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు. పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించడంతో అధికారులు అతన్ని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.

Follow us on : Facebook, Instagram, YouTube Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: