Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News వివాదాస్పదంగామారుతున్నకెబిఆర్ పార్క్ రోడ్ వెడల్సు

వివాదాస్పదంగామారుతున్నకెబిఆర్ పార్క్ రోడ్ వెడల్సు

by Rama
వివాదాస్పదంగామారుతున్నకెబిఆర్ పార్క్ రోడ్ వెడల్సు

హైదరాబాద్ లో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు జిహెచ్ఎంసి, ట్రాఫిక్ పోలీసులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రోడ్ల పరిస్థితి, ఆయా రోడ్లపై సగటును రాకపోకలు చేస్తున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నప్పటికీ అధికారులు తీసుకుంటున్న చర్యలు నగరవాసులకు ఇబ్బందులు కలిగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో బడాబాబులకు మేలు చేసేవిగా ఉంటున్నాయి. జూబ్లీహిల్ప్, బంజారాహిల్స్, ఫిలింనగర్ ల మధ్య ఉన్న కెబిఆర్ పార్క్ కు ఓవైపు చేయదలచిన రోడ్ వెడల్పు కార్యక్రమం పట్ల స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్ప్ రోడ్ నెంబర్ 92ను వెడల్పు చేసే క్రమంలో ఈ రోడ్ లో ఉన్న జర్నలిస్టు కాలనీ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇస్తున్నారు. కెబిఆర్ పార్క్ ను ఆనుకుని ఉన్న ఈ రోడ్ ను వెడల్పు చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరమే అయినప్పటికీ అధికారులు అనుసరిస్తున్న రూట్ మ్యాప్ సరిగా లేదని స్థానికులు వాపోతున్నారు. జూబ్లీహిల్ప్ హౌసింగం సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోడ్ లో భారీ బహుళ అంతస్తుల భవనాలను కాపాడేందుకే తమ నిర్మాణాలను కూల్చివేసేందుకు నోటీసులు ఇస్తున్నారని స్థానికులంటున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఆఫ్రికాలో ఎబోలా కలకలం..
    ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది. కాంగో, ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కాంగోలో 88మంది మృతి చెందగా…మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ…
  • ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..
    ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు…
  • తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..
    తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..2 బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్…
  • మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..
    వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలు రెండోసారి పెరిగాయి. రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు.…
  • మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..
    నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024, 2026 సంవత్సరాల పరిస్థితులను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేపదే పేపర్ లీక్‌లు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014330
Total views : 79941

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.