ఎన్నికల్లో అఖండ మెజార్టీ దక్కడంలో ఎన్డీఏ కూటమి నేతలు చేసిన కృషికి క్లస్టర్ ల వారీగా జనసేన, తెలుగుదేశం, బిజేపి నేతలకు కృతజ్జతలు తెలిపేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 13,14,15 డివిజన్లకు సంబంధించిన టిడిపి క్లస్టర్ ఇన్చార్జీ శ్రీధర్ వర్మ, జనసేన టౌన్ అధ్యక్షులు రాజా రెడ్డి, బిజేపి జిల్లా కార్యదర్శి వరప్రసాద్ ల ఆధ్వర్యంలో కృతజ్జతా సమావేశం బైరాగిపట్టెడలోని వైఖానస మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను గజమాలతో ఎన్డీఏ కూటమి నేతలు సత్కరించారు.
అనంతరం టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ,టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి,జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ…గత ఐదేళ్ళలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురైయ్యారని ఆయన చెప్పారు. టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్క నెల కూడా గడవక ముందే కూటమి పార్టీల్లోకి రావాలని చూస్తున్నారని అటువంటి వారిని అందరిని కలుపుకుని అడ్డుకుంటామని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి