కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇదిలాఉంటే.. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ మరో ఎమ్మెల్సీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్సీ చల్లా కోరినట్లు తెలుస్తోంది. చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా. రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. తొలుత ఈనెల 9న మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితర ప్రధాన అంశాలపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సమయంలో చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి