Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రం

తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రం

by Satya
తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రం

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో ఢిల్లీ పెద్దలను కోరినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిందన్నారు. తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్రంని ఆరోపించారు. విభజన చట్టం హామీల గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై చర్చ జరిగింది. తమకు మిత్రపక్షాలుగా ఉన్న ఏపీ, బీహార్ కే ఎక్కువ నిధులు ఇచ్చిందని, కేంద్రం అనుసరిస్తున్న ఈ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటల బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పేరును ప్రస్తావించలేదని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. పూర్వోదయ స్కీమ్ లోనూ కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఇలాంటి నిర్ణయాలతో వికసిత్ భారత్ సాధ్యం కాదన్నారు కేంద్రం అనుసరిస్తున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా సభ్యులంతా కలిసి రావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..
    అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటుంటే.. కల్లాల్లో రైతుల కన్నీళ్లు ఉప్పొంగుతున్నాయి. పంటలు పండించిన పాపానికి..అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో…
  • కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
    డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014453
Total views : 80237

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.