ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ మేరకు కవితకు మద్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మద్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతివాదులైన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత తరఫు లాయర్ రోహత్గీ దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేస్తామని, కేసును వెంటనే విచారణ చేపట్టాలని, లేని పక్షంలో సోమవారం విచారించాలని ధర్మాసనాన్ని రిక్వెస్ట్ చేశారు.ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. ఆయన వాదనలను తోసిపుచ్చుతూ ఈ నెల 20న కేసుపై తిరిగి విచారణ చేపడతామని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. కాగా, కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా.. జ్యుడీషియల్ రిమాండ్‌లో అప్పటి నుంచి ఆమె తీహార్ జెల్లోనే ఉంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 199276