పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. లోకేష్ కు అక్కడి తెలుగు ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారత దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ హైటెక్ సిటీ పేరు చెప్పగానే చంద్రబాబు గుర్తుకు వస్తారు. 2000 సంవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని వారు ప్రశంసించారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేష్ కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.భారత క్రికెట్‌కు మరో అద్భుతమైన యువ సంచలనం దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 సీజన్‌ను తన పేలవమైన కాదు, పేలుడు బ్యాటింగ్‌తో ఏకంగా శాసించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఆటగాడు…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
- కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అలేఖ్యపై తీవ్ర ఆరోపణలు.కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య పై స్థానికంగా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలలో ఆమె పాలన పట్ల ఆవేదన ఉంది. గతంలో చెక్ పోస్టుల వద్ద వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయిందని, గత చైర్మన్‌ల ఆధీనంలో ఉన్న…
- మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90262