Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రి

కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రి

by Rama
కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి ఆయన ‘జితేందర్ రెడ్డి’ సినిమాను చూశారు. సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు అన్నారు. అందుకే మోసాలు, అబద్ధాలకు రేవంత్ రెడ్డి కేరాఫ్ అడ్రస్‌గా మారారని విమర్శించారు.

ఆరు గ్యారెంటీలపై మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం కాదని… తెలంగాణలో ఉండి చెప్పాలని సవాల్ చేశారు. నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారని, అందులో వీటిని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం చెప్పారని… కానీ 20 లక్షల మంది రైతులకు మాఫీ కాలేదన్నారు. ఇతర హామీలు కూడా అమలు చేయలేదన్నారు.

హామీలు నెరవేర్చకుండానే మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మేమూ మహారాష్ట్రలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బండారాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంపై పదకొండు నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చిందన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారని తెలిసే హర్యానాలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీపై యుద్ధం చేస్తామని సీఎం అంటున్నారని… ఎందుకు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? రోడ్లకు నిధులు ఇస్తున్నందుకా? స్మార్ట్ సిటీలు తయారు చేస్తున్నందుకా? గ్రామాలను అభివృద్ధి చేస్తున్నందుకా? ఎందుకు యుద్ధం చేస్తారో చెప్పాలన్నారు.

రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై కేసీఆర్ ప్రభుత్వం రూ.1 లక్ష అప్పు చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుమించి చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడో మరిచిపోయారన్నారు. అందుకే ఆయన ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వంటి వారిని తెలంగాణ సమాజం లీడర్‌గా భావించదన్నారు. రాష్ట్రంలో సమస్యలు వచ్చినప్పుడు బయటకు రాని కేసీఆర్… కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తానని అంటున్నాడని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే ఓటేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
    తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
  • ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
    తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
  • హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
    హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ…
  • వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.
    ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
  • స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.
    స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: